ఆమెను వేధించిన మాట నిజమే.. విచారణలో అంగీకరించిన స్వామి చిన్మయానంద్

తాను నిర్వహిస్తున్న కాలేజీలో న్యాయవాద విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినిని లైంగికంగా వేధించినట్టు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద్ ( 73) అంగీకరించినట్టు సిట్ అధికారులు వెల్లడించారు. షహజన్‌పూర్‌లో ‘లా’ కాలేజీలో అడ్మిషన్ విషయంలో తనకు సహాయపడిన స్వామి చిన్మయానంద్ ఏడాది కాలం పాటు తనను లైంగికంగా వేధించాడని విద్యార్ధిని ఆరోపిస్తోంది. ఈ కేసులో యువతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. […]

ఆమెను వేధించిన మాట నిజమే.. విచారణలో అంగీకరించిన స్వామి చిన్మయానంద్
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 5:51 PM

తాను నిర్వహిస్తున్న కాలేజీలో న్యాయవాద విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినిని లైంగికంగా వేధించినట్టు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద్ ( 73) అంగీకరించినట్టు సిట్ అధికారులు వెల్లడించారు.

షహజన్‌పూర్‌లో ‘లా’ కాలేజీలో అడ్మిషన్ విషయంలో తనకు సహాయపడిన స్వామి చిన్మయానంద్ ఏడాది కాలం పాటు తనను లైంగికంగా వేధించాడని విద్యార్ధిని ఆరోపిస్తోంది. ఈ కేసులో యువతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో సిట్ అధికారులు చిన్మయానంద్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టు ముందు హాజరు పరచగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

స్వామి చిన్మయానంద్ తనకు లా కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడంతో పాటు, లైబ్రరీలో ఉద్యోగం ఇప్పించాడని, ఆయన కోరిక మేరకు తన ఆశ్రమంలోనే కలిసినట్టు బాధితురాలు చెప్పింది. ఇదే క్రమంలో తాను స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి తాన్ని వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని ఆమె ఆరోపించింది. ఈ విధంగా తనపై ఏడాది కాలంగా జరిగిన లైంగికదాడిని కూడా వీడియో రికార్డ్ చేసి తనను వేధించారంటూ బాధితురాలు ఆరోపణలు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ విషయాలన్నీ నిజమేనని చిన్మయానంద్ అంగీకరించినట్టు సిట్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ విధంగా చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని , అనేకసార్లు ఆమెను వేధించినట్టుగా ఒప్పకున్నారని అధికారి వెల్లడించారు.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం