రేప్ ఆరోపణలు..చిక్కుల్లో బీజేపీ నేత స్వామి చిన్మయానంద

swami chinmayananda allegedely get naked massage video goes viral, రేప్ ఆరోపణలు..చిక్కుల్లో బీజేపీ నేత స్వామి చిన్మయానంద

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై ఏడాదికాలంగా లైంగికంగా వేధిస్తూ వచ్చాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని యూపీలో ఓ లా కాలేజీ విద్యార్థిని ఆరోపిస్తోంది. తన ఒంటిని మాసేజ్ చేయాల్సిందిగా చిన్మయానంద కోరాడంటూ బాధితురాలు విడుదల చేసినట్టు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తన కళ్ళద్దాల్లో ఫిక్స్ చేసిన స్పై కెమెరా ద్వారా బాధితురాలు ఈ వీడియోను షూట్ చేసిందని ఓ మీడియా వెబ్ సైట్ పేర్కొంది. ఈ వీడియో క్లిప్ ని ఆమె కుటుంబ సభ్యులు ‘ సిట్ ‘ అధికారులకు అందజేశారు. కాగా-షాజహాన్ పూర్ లో బాధితురాలు ఉంటున్న హాస్టల్లోని ఆమె గదిని వారు చాలాసేపు సెర్చ్ చేశారు. ఈ వీడియో క్లిప్ నిజమైందా లేక ఫేక్ వీడియో అన్నదానిపై వారింకా ఓ నిర్ధారణకు రావాల్సి ఉంది. అయితే తన క్లయింటుపై బాధితురాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఈ వీడియో అన్నది బూటకమని స్వామి చిన్మయానంద తరఫు లాయర్ ఓంసింగ్ అంటున్నారు. చిన్మయానంద ప్రతిష్టను దిగజార్చడానికే ఈ ప్రయత్నమని ఆయన ఖండించాడు. మరోవైపు.. చిన్మయానందపై రేప్ కేసు పెట్టేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని బాధితురాలు మీడియా వద్ద వాపోయింది. ఈ నెల 8 న ఖాకీలు సుమారు 11 గంటల పాటు తనను ప్రశ్నించారని, అయినా వారు 72 ఏళ్ళ ఈ ‘ స్వామి ‘ మీద కేసు పెట్టడానికి సందేహిస్తున్నారని ఆమె వారిని దుయ్యబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *