SVM Prana Bike : మ‌రో మేడిన్ ఇండియా ఈ-బైక్‌ విడుదల.. టాప్ స్పీడ్ గంట‌కు 120 కి.మీ.. ఈజీ ఈఎంఐ ప్లాన్..

SVM Prana Bike : భార‌త విప‌నిలోకి మ‌రో ఎల‌క్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది. శ్రీవ‌రు మోటార్స్ సంస్థ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రాణ ఆల్

SVM Prana Bike : మ‌రో మేడిన్ ఇండియా ఈ-బైక్‌ విడుదల.. టాప్ స్పీడ్ గంట‌కు 120 కి.మీ.. ఈజీ ఈఎంఐ ప్లాన్..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:08 AM

SVM Prana Bike : భార‌త విప‌నిలోకి మ‌రో ఎల‌క్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది. శ్రీవ‌రు మోటార్స్ సంస్థ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రాణ ఆల్ ఎలక్ట్రిక్ బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. టెస్లాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసిన మోహన్రాజ్ రామస్వామి యొక్క ఆలోచనకు ప్రతిరూప‌మే ఈ ప్రాణ ఎల‌క్ట్రిక్ బైక్‌.

తాజాగా శ్రీ‌వ‌రు మోటార్స్‌( SVM) ప్రాణ ఈ-బైక్ గంట‌కు 123 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంటే 150 సిసి పెట్రోల్‌ బైక్‌ల కంటే వేగంలో మెరుగైన‌ది. ప్రాణలో గంటకు 0-60 కి.మీ వేగాన్ని కేవ‌లం 4 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ బైక్ సింగిల్ ఛార్జీతో 126 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ వాహ‌నంలో గ్రేడ్‌ ఎ ఎల్‌ఎఫ్‌పి లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఈ బ్యాట‌రీ 3 లక్షల కిలోమీటర్ల లైఫ్ సైకిల్‌తోపాటు 2,000 చార్జింగ్ సైకిల్స్ వ‌కు ప‌నిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఎస్వీఎం కంపెనీ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ ఇప్పటికే కోయంబత్తూర్‌లో ఉండ‌గా, త్వర‌లో మదురై, తిరుపూర్, కోజికోడ్, పాండిచేరి, దిండుక్కల్, త్రిచి మరియు బెంగళూరులలో ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేరళలోని మరిన్ని ప్రదేశాలలో విస్తరించనున్నట్లు ఎస్వీఎం ధ్రువీకరించింది. ప్రాణ ఆల్-ఎలక్ట్రిక్ బైక్‌తో ఈజీ ఈఎంఐ ప్లాన్‌లను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది నెలకు రూ.5,200 గా ఉంటుందని, మూడేళ్ల తర్వాత ఖర్చు కేవలం విద్యుత్ బిల్లులకే పరిమితం అవుతుందని చెప్పారు.

Shardul Thakur: ఆ సిక్సర్ గురించి ముందస్తు ప్రణాళిక ఏం రచించలేదు.. క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే..