Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

లీకైన పృథ్వీ వీడియో.. అధికారులు సీరియస్..!

SVBC Chairman Prudhvi Raj Srivari chakrasnanam promo video viral in social media, లీకైన పృథ్వీ వీడియో.. అధికారులు సీరియస్..!

తాజాగా.. పృథ్వీ వీడియో ఒకటి లీకైంది. భాష రాక తను వీడియోలో పడ్డ కష్టాలు.. అతనికి నవ్వుల పాలుగా మారింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు చక్రస్నానంపై పృథ్వీ మాట్లాడిన ప్రోమో లీక్ అయ్యింది. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా..? ఆ ప్రొమో వల్ల.. పృథ్వీ ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. శ్రీవారి చక్రస్నానం పుష్కరిణి సమయంలోనే అవసరంలేదు.. 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చంటూ పృథ్వీతో.. ఎస్వీబీసీ ఛానెల్ ఓ ప్రోమో చేశారు. అయితే.. ఈ వీడియోలో తెలుగులో చకచకా చెప్పేసిన పృథ్వీ.. తమిళంలో మాత్రం డైలాగులు చెప్పేందుకు కిందా.. మీదా.. పడాల్సి వచ్చింది. ఆ సమయలో పృథ్వీకి అక్కడున్న కొందరు అతనికి డైలాగులు అందించారు.

అయితే.. పృథ్వీ చెప్పిన డైలాగ్స్ సరిగా రాని కారణంగా.. ఆవీడియోను పక్కన పెట్టేశారు ఎస్వీబీసీ అధికారులు. కానీ.. కొందరు తీసిని వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి.. అధికారుల దృష్టికి చేరింది. దీంతో.. దానిపై విచారణకు ఆదేశించారు అధికారులు. మరోవైపు పృథ్వీ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో అమెరికాలో ఉన్నారు పృథ్వీ.

Related Tags