అనుమానాస్పద స్థితిలో అడవి మృగాల మరణాలు..

Suspicious deaths of animals in Kurnool district, అనుమానాస్పద స్థితిలో అడవి మృగాల మరణాలు..

ఏపీలోని పలు జిల్లాల్లో అనుమానాస్పద స్థితిలో వన్యమృగాలు మృత్యువాతడ్డాయి. కర్నూలు జిల్లాలో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి మృతి కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామ సమీపాన ఉన్న తెలుగుగంగ కాలువలో చిరుత చనిపోయింది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎఫ్‌ఓ అధికారులు..చిరుత మృతదేహన్ని స్వాదీనం చేసుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి చిరుత మృతిపై ఆరా తీస్తున్నారు. కాగా గతంలో ఎనిమిది నెలల క్రితం మిట్టపల్లి సమీపంలోని తెలుగు గంగ కాలువలో చిరుత చనిపోయింది. తిరిగి అటువంటి ఘటనే పునరావృతం కావడంతో వేటగాళ్ల పనిగా అనుమానిస్తూ…అధికారులు అప్రమత్తమయ్యారు. అటు అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామ సమీపంలో ఎలుగుబంటి ప్రాణం లేకుండా కనిపించింది. ఎలుగు శరీరంపై రక్తపు మరకలు గమనించిన అధికారులు..ఇది కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చాలా ప్రాంతాల్లో వేటగాళ్లు బిగించి ఉచ్చు, విద్యుత్‌ వైర్ల కారణంగా అడవి మృగాలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆహారం, దాహం తీర్చుకోవటం కోసం వచ్చి ఇలా ప్రాణాలు కొల్పోతున్నాయంటున్నారు అటవీశాఖ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *