తెరపైకి లవ్ జిహాద్.. ఎన్‌సీడ‌బ్ల్యూ చీఫ్ రేఖాశ‌ర్మ‌పై నెటిజన్ల ఫైర్

జాతీయ మ‌హిళ సంఘం (ఎన్‌సీడ‌బ్ల్యూ) చీఫ్ రేఖా శ‌ర్మ‌పై ఆన్‌లైన్ యూజ‌ర్లు ఫైర్ అవుతున్నారు. మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర గ‌వర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశియారితో భేటీ అయిన త‌ర్వాత రేఖా శర్మ ఓ ట్వీట్ చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:22 pm, Wed, 21 October 20

జాతీయ మ‌హిళ సంఘం (ఎన్‌సీడ‌బ్ల్యూ) చీఫ్ రేఖా శ‌ర్మ‌పై ఆన్‌లైన్ యూజ‌ర్లు ఫైర్ అవుతున్నారు. మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర గ‌వర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశియారితో భేటీ అయిన త‌ర్వాత రేఖా శర్మ ఓ ట్వీట్ చేశారు. గ‌వ‌ర్న‌ర్‌తో మ‌తాంత‌ర వివాహాలు, ల‌వ్ జిహాద్ గురించి చ‌ర్చించిన‌ట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ల‌వ్ జిహాద్‌పై దృష్టి పెట్టాల్సి అవసరమున్నట్లు ఆమె వెల్ల‌డించారు. హిందూ మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా మ‌తం మార్పిడితో  ముస్లిం పురుషులు పెళ్లి చేసుకోవ‌డం ల‌వ్ జిహాద్ అంటున్నారు. వాస్త‌వానికి దేశంలో ల‌వ్ జిహాద్ జ‌రుగుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు. కానీ, మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ రేఖా శ‌ర్మ‌.. ఎలా ల‌వ్ జిహాద్‌పై కామెంట్ చేశార‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేద‌ని ఆమె ఎలా అంటారని మండిపడుతున్నారు. ఇద్ద‌రు ప్రేమికులు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఎలా అడ్డుకుంటారని రేఖా శ‌ర్మ‌పై విరుచుకుపడుతున్నారు. వెంటనే ఆమెను ఎన్‌సీడ‌బ్ల్యూ నుంచి తొల‌గించాల‌ని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

గ‌తంలో రేఖా శ‌ర్మ చేసిన ప‌లు వివాదాస్ప‌ద ట్వీట్ల‌ను కొంద‌రు సోష‌ల్ మీడియా యూజ‌ర్లు షేర్ చేశారు. ప్ర‌స్తుతానికి ఆ ట్వీట్లు ఆమె అకౌంట్‌లో క‌నిపించ‌డం లేదు. రేఖా శ‌ర్మ త‌న ప్రొఫైల్‌ను మార్చ‌ేసింది. కానీ త‌న అకౌంట్‌ను ఎవ‌రూ హ్యాక్ చేశార‌ని రేఖా శ‌ర్మ తాజాగా ఆరోపించారు. ట్విట్ట‌ర్‌లో త‌న ప్రొఫైల్‌ను ఎవ‌రో బ్లాక్ చేశార‌ని ఆమె అన్నారు. అయితే, ఇటీవ‌ల త‌నిష్క్ జ్వెల‌రీ బ్రాండ్ రూపొందించిన ఓ యాడ్ వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆ యాడ్‌ మ‌తాంత‌ర వివాహాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా ఉన్న‌ది. దీంతో ఆ యాడ్‌ను బ్యాన్ చేయాల‌ని త‌నిష్క్‌పై కొంద‌రు వ‌త్తిడి తెచ్చారు. ఆ త‌ర్వాత త‌నిష్క్ సంస్థ ఆ యాడ్‌ను ఎత్తివేసింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోశియారిని రేఖా శ‌ర్మ భేటీ అయ్యినట్లు సమాచారం.