కేశినేని నాని టార్గెట్ ఏంటి..?

మొన్న సొంత పార్టీనే రోడ్డు మీదకు లాగి రచ్చ రచ్చ చేశారు. నిన్న వైసీపీ మీద దాడి చేస్తూ పీవీపీని ట్వీట్ వార్ లోకి దింపాడు. దీంతో పాటు ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నేడు కమ్యూనిస్ట్ పార్టీలో కలహానికి సై అంటే సై అంటున్నారు. అసలు కేశినేని నాని టార్గెట్ ఏంటి ? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారన్నది అర్థంకాక తెలుగు తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. టీడీపీలో హైలైట్ అవుతున్న నేతలు ప్రస్తుతం ఇద్దరే ఇద్దరు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:31 pm, Sun, 28 July 19

మొన్న సొంత పార్టీనే రోడ్డు మీదకు లాగి రచ్చ రచ్చ చేశారు. నిన్న వైసీపీ మీద దాడి చేస్తూ పీవీపీని ట్వీట్ వార్ లోకి దింపాడు. దీంతో పాటు ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నేడు కమ్యూనిస్ట్ పార్టీలో కలహానికి సై అంటే సై అంటున్నారు. అసలు కేశినేని నాని టార్గెట్ ఏంటి ? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారన్నది అర్థంకాక తెలుగు తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు.

టీడీపీలో హైలైట్ అవుతున్న నేతలు ప్రస్తుతం ఇద్దరే ఇద్దరు. ఒకరు పార్టీ అధినేత చంద్రబాబు. మరొకరు కేశినేని నాని. ఈ మధ్య నాని ట్వీట్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. బుద్దా వెంకన్నతో నాని సాగించిన ట్వీట్ వార్ పార్టీని రోడ్డుకి లాగినట్టు అయింది. చివరకు అటు బుద్దా,ఇటు నాని ఇద్దరూ వ్యక్తిగతంగా విమర్శల దాకా వెళ్లారు. మధ్యలో ఒక అడుగు ముందుకేసిన నాని.. చంద్రబాబుని కూడా సీన్ లోకి లాగి టీడీపీ శ్రేణుల్లో మరింత అలజడి రేపారు.

స్వయంగా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడంతో ఇక నాని బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే చర్చ ఊపందుకుంది. అయితే ఇప్పుడు నాని తన ఫోకస్ ని ఒక్కసారిగా వైసీపీ వైపు మార్చారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ వార్ ప్రారంభించారు. దీనికి రీట్వీట్ గా నానిని ఫిక్స్ చేస్తూ పీవీపీ చేసిన ట్వీట్ కేశినేని ట్రావెల్స్ సిబ్బంది మరోసారి రోడ్డెక్కేలా చేసింది. దీనికి తోడు కామ్రేడ్స్ తో కలహానికి సై అంటున్నాడు. అసలు నాని ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారనేది ఎవరికి తెలియడం లేదు.