ఆమె ఓ మహోన్నత వ్యక్తి… . స్వరాజ్ కౌశల్

మంగళవారం రాత్రి కన్ను మూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి దేశం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అనేకమంది ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా సుష్మ భర్త స్వరాజ్ కౌశల్ ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. ఇన్నేళ్ళుగా తనతో జీవితం పంచుకున్న తన భార్య ఇక లేదని తెలిసి ఆయన ఆమె స్మృతులను తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. 67 ఏళ్ళ సుష్మ..దాదాపు ఏడాది, ఏడాదిన్నర కాలంగా అస్వస్ధతతో […]

ఆమె ఓ మహోన్నత వ్యక్తి... . స్వరాజ్ కౌశల్
Follow us

|

Updated on: Aug 07, 2019 | 1:09 PM

మంగళవారం రాత్రి కన్ను మూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి దేశం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అనేకమంది ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా సుష్మ భర్త స్వరాజ్ కౌశల్ ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. ఇన్నేళ్ళుగా తనతో జీవితం పంచుకున్న తన భార్య ఇక లేదని తెలిసి ఆయన ఆమె స్మృతులను తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. 67 ఏళ్ళ సుష్మ..దాదాపు ఏడాది, ఏడాదిన్నర కాలంగా అస్వస్ధతతో బాధ పడుతూ వచ్చారు. ఆస్పత్రుల్లో రోజులతరబడి చికిత్స పొందుతూ వచ్చారు. అంతటి సమయంలోనూ ఆమె భర్త స్వరాజ్ కౌశల్ ఆమె వెన్నంటే ఉన్నారు.

‘ ఇక మీ పొలిటికల్ కెరీర్ చాలు.. విశ్రాంతి తీసుకోండి ‘ అని ఆయన కోరినప్పుడు ఆమె వెంటనే అంగీకరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇందుకు ఆయన సంతోషించని క్షణం లేదు. సుష్మకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఒకప్పుడు పరుగులవీరుడు మిల్కా సింగ్ కూడా తన పరుగును ఆపాడు అని వ్యాఖ్యానించారు.

1977 నుంచి నీ ‘ మారథాన్ ‘ కొనసాగుతోంది. నువ్వు 11 ఎన్నికల్లో పోటీ చేశావు. నిజానికి 1977 నుంచే నీ ప్రస్థానం మొదలైంది. కానీ.. 1991 లోను, , ఆ తరువాత 2004 లోను పార్టీ నిన్ను అనుమతించని సందర్భాల్లో తప్ప అన్ని ఎలక్షన్స్ లోనూ పాల్గొన్నావు. అని ఆయన ట్వీట్ చేశారు. 1990-93 మధ్య మిజోరాం గవర్నర్ గా పని చేసిన స్వరాజ్ కౌశల్.. లోక్ సభ ఎంపీగా నాలుగు సార్లు, రాజ్యసభ ఎంపీగా మూడు సార్లు వ్యవహరించారు. అటు-సుష్మ రాష్ట్ర అసెంబ్లీలకు మూడు సార్లు ఎన్నికయ్యారు.

‘ నువ్వు 25 వ ఏటినుంచే ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చావు. 41 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోరాడుతున్నావు. ఇదో మహా ప్రస్థానం అని స్వరాజ్ కౌశల్ పేర్కొన్నారు. ‘ మేడం.. గత 46 ఏళ్లుగా నేను మీ వెంట పరుగులు తీస్తున్నాను. ఇప్పుడు నేను 19 ఏళ్ళ యువకుడ్ని కాను.. ఇక నా శ్వాస కూడా తగ్గిపోతోంది..థ్యాంక్యూ అని ఆయన అన్నారు.

2016 లో సుష్మా స్వరాజ్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. కానీ కోలుకున్న అనంతరం కూడా ఆమె విదేశాంగ మంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూవచ్చారు. 2018 లో లక్నో కు చెందిన ఓ ముస్లిం జంట తమ పాస్ పోర్టులు పొందడానికి సుష్మ సాయం కోరినప్పుడు ఆమె ఇఛ్చిన ఆదేశాలతో పాస్ పోర్టు అధికారులు ఆ జంటకు వెంటనే పాస్ పోర్టులు మంజూరు చేశారు. అయితే ముస్లిములకు మీరిలా సాయం చేస్తారా అంటూ నెట్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇందుకు మీ భార్యను మీరు కొట్టాలంటూ కొంతమంది నెటిజన్లు స్వరాజ్ కౌశల్ కు ట్వీట్ చేయగా.. అది తననెంతో బాధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబం పట్ల సుష్మ స్వరాజ్ చూపిన ఆదరాభిమానాలను, ప్రేమను మరిచిపోలేనన్నారు. 1993 లో తన తల్లికి క్యాన్సర్ సోకి ఆసుపత్రి పాలైనప్పుడు ఆమె ఏడాది పాటు ఆస్పత్రిలోనే తన తల్లి బెడ్ పక్కన ఉండి సేవలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పైగా మృతి చెందిన తన తండ్రి చితికి ఆమె నిప్పు పెట్టిన విషయాన్ని కూడా స్వరాజ్ కౌశల్ గుర్తు చేశారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..