దిశా మృతిపై దర్యాప్తు జరిపించాలి, సుశాంత్ స్నేహితుని అభ్యర్థన

సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతిపై సీబీఐ  చేత దర్యాప్తు జరిపించాలని అతని స్నేహితుడు, జిమ్ పార్ట్ నర్ కూడా అయిన సునీల్ శుక్లా బాంబే హైకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్, దిశా ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మరణించారని ఆయన అన్నారు. దిశా మరణంపై ముంబై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ పలు అంశాలను పరిశీలించలేదని సునీల్ పేర్కొన్నారు. సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ఎంతయినా అవసరమని ఆయన […]

  • Umakanth Rao
  • Publish Date - 8:41 pm, Thu, 29 October 20

సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతిపై సీబీఐ  చేత దర్యాప్తు జరిపించాలని అతని స్నేహితుడు, జిమ్ పార్ట్ నర్ కూడా అయిన సునీల్ శుక్లా బాంబే హైకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్, దిశా ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మరణించారని ఆయన అన్నారు. దిశా మరణంపై ముంబై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ పలు అంశాలను పరిశీలించలేదని సునీల్ పేర్కొన్నారు. సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ఎంతయినా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.