అఫీషియల్: బన్నీ సినిమాలో అక్కినేని హీరో.. అతడెవరంటే..!

Sushanth Plays Cricial Role, అఫీషియల్: బన్నీ సినిమాలో అక్కినేని హీరో.. అతడెవరంటే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ రెండో షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అక్కినేని హీరో సుశాంత్. దీనిపై ఈ యంగ్ అధికారిక ప్రకటనను ఇచ్చేశాడు.

‘‘ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. నాకు ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ సర్‌, ఆర్య నుంచి నేను బాగా ఇష్టపడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టబు, నా స్నేహితురాలు పూజా, పీఎస్ వినోద్ సర్, థమన్ మిగిలిన నటీనటులు అందరితో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్‌కు చాలా థ్యాంక్స్. చి.ల.సౌ తరువాత ఈ చిత్రం నాకు మరో అద్భుత ప్రయాణం. ఈ టీమ్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటానని భావిస్తున్నా’’ అంటూ శుశాంత్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

కాగా బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది. ఇదివరకు ఈ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలను సాధించడంతో ఇప్పుడు రాబోతున్న హ్యాట్రిక్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *