డిప్రెషన్… తల్లి మరణం జీర్ణించుకోలేక… ?

టీవీ, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఈ రెండు రంగాల్లో విషాదం నింపింది. అనేకమంది అతని మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాగా.. డిప్రెషన్, మానసిక ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్టు..

డిప్రెషన్... తల్లి మరణం జీర్ణించుకోలేక... ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 4:16 PM

టీవీ, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఈ రెండు రంగాల్లో విషాదం నింపింది. అనేకమంది అతని మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాగా.. డిప్రెషన్, మానసిక ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. గత వారమే తన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకోవడంపై.. సుశాంత్..’ ఇది ఎంత విషాదకరమైన వార్త.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నాడు. లోగడ దివంగతురాలైన తన తల్లి స్మృతులను తలచుకుని ఆమెకు శ్రధ్ధాంజలి ఘటిస్తూ.. ‘ఈ కన్నీటి చుక్కల నుంచి గతమంతా ఆవిరైపోతోందని, సమాప్తమంటూ లేని కలలు చిరునవ్వుకు అడ్డుగా నిలుస్తున్నాయని, ఈ రెండింటి మధ్య జీవితం నలుగుతోందని’  రాసుకొచ్చాడు.

1986 జనవరి 21 న పాట్నాలో పుట్టిన సుశాంత్.. ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆస్ట్రేలియాలో 2005 లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెరిమనీలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2018 లో సారా అలీఖాన్ తో ‘కేదార్ నాథ్’ చిత్రంలో నటించిన సుశాంత్.. 2019 లో ఛిచ్చొర్, సొంచిరియా, డ్రైవ్ సినిమాల్లోనూ తనదైన శైలితో నటించి మెప్పించాడు.