చనిపోయేముందు సుశాంత్​ గూగుల్​లో ఏం సెర్చ్ చేశాడంటే…!

బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్​ సింగ్​ మ‌ర‌ణం యావ‌త్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుదిపిన విష‌యం తెలిసిందే. కాగా అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగులోకి వ‌స్తుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:20 am, Sun, 5 July 20

బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్​ సింగ్​ మ‌ర‌ణం యావ‌త్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ కుదుపు కుదిపిన విష‌యం తెలిసిందే. కాగా అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి రోజుకో కొత్త కోణం వెలుగులోకి వ‌స్తుంది. తాజాగా ఫోరెన్సిక్​ రిపోర్టులో ఆస‌క్తిక‌ర విష‌యాలు రివీల్ అయ్యాయి. సూసైడ్ కు ముందు గూగుల్​లో తన గురించే సుశాంత్ సెర్చ చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. అతడి గురించి ఈ మ‌ధ్యకాలంలో వచ్చిన కొన్ని కథనాలు చదివాడని పేర్కొన్నారు.

జూన్​ 14న ఆత్మ‌హ‌త్య‌కు కొద్ది నిమిషాల ముందు అంటే ఉదయం 10:15 గంటల ప్రాంతంలో, సుశాంత్​ తన పేరునే గూగుల్​ చేసినట్లు విచార‌ణ‌లో తెలిసింది. అదే సమయంలో ప్రూట్ జ్యూస్ తాగిన‌ట్లు అధికారులు గుర్తించారు. తరచుగా గూగూల్​లో తన పేరును సెర్చ్​ చేసి..త‌న టీమ్ తో మాట్లాడేవాడ‌ని వివరించారు. ఈ క్రమంలోనే తన ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నట్లు అతడు భావించినట్లు వివ‌రించారు. ఇటీవల పోస్టుమార్టం నివేదికలో సుశాంత్​ ఉరివేసుకోవడం వల్లే చ‌నిపోయిన‌ట్లు తేలింది. అయితే, నటుడు సూసైడ్ చేసుకోవడానికి పలువురు మూవీ సెల‌బ్రిటీస్ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇప్ప‌టికే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సహా మొత్తం 30 మందిని విచారించారు.