సుశాంత్ కేసులో ‘మహా’ సీఎంపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఫైర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నిప్పులు చెరిగారు. ఈ కేసుతో ప్రమేయమున్నవారిని కాపాడాలంటూ బాలీవుడ్ మాఫియా నుంచి ఉధ్ధవ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో బాలీవుడ్ మాఫియా చెలరేగిపోతోందని, పోలీసులు కూడా నిస్సహాయులయ్యారని ఆయన అన్నారు. ఈ మాఫియా కారణంగానే ఉధ్ధవ్ థాక్రే.. సుశాంత్ మృతికి కారకులైనవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోడీ అన్నారు. అలాగే […]

సుశాంత్ కేసులో 'మహా' సీఎంపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2020 | 3:53 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నిప్పులు చెరిగారు. ఈ కేసుతో ప్రమేయమున్నవారిని కాపాడాలంటూ బాలీవుడ్ మాఫియా నుంచి ఉధ్ధవ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో బాలీవుడ్ మాఫియా చెలరేగిపోతోందని, పోలీసులు కూడా నిస్సహాయులయ్యారని ఆయన అన్నారు. ఈ మాఫియా కారణంగానే ఉధ్ధవ్ థాక్రే.. సుశాంత్ మృతికి కారకులైనవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని సుశీల్ మోడీ అన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిస్పాక్షిక దర్యాప్తు చేయనున్న బీహార్ పోలీసులను ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా ఆయన విమర్శించారు.

ఇలా ఉండగా పాట్నా నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం ముంబై బయల్దేరింది. ఈ బృందం సుశాంత్ మృతికి దారి తీసిన పరిస్థితులను, ఫోరెన్సిక్ రిపోర్టులను పరిశీలించి తమకు  తాము స్వతంత్ర దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా-తమ నగర పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి లోపమూ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఇదివరకే ప్రకటించారు.