అజిత్ డైరెక్టర్ తో సూర్య సినిమా..!

వైవిధ్యమైన కథలు ఎంచుకోవడంలో తమిళ హీరో సూర్యకు సాటి ఎవరూ లేరు. హిట్.. ప్లాప్ అనే సంబంధం లేకుండా వరస పెట్టి డిఫరెంట్ స్టోరీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక గతంలో సూర్య, ‘విశ్వాసం’ డైరెక్టర్ శివ తో కలిసి ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. పక్కా యాక్షన్ అండ్ కామెడీ […]

అజిత్ డైరెక్టర్ తో సూర్య సినిమా..!
Follow us

|

Updated on: Mar 23, 2019 | 4:56 PM

వైవిధ్యమైన కథలు ఎంచుకోవడంలో తమిళ హీరో సూర్యకు సాటి ఎవరూ లేరు. హిట్.. ప్లాప్ అనే సంబంధం లేకుండా వరస పెట్టి డిఫరెంట్ స్టోరీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక గతంలో సూర్య, ‘విశ్వాసం’ డైరెక్టర్ శివ తో కలిసి ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందట.

మరోవైపు దర్శకుడు శివ ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో కలిసి ‘విశ్వాసం’ అనే సినిమా తీశాడు. ఇది తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలిచింది.