సూర్య చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..!

తమిళ హీరో సూర్య ప్రస్తుతం కె.వి.ఆనంద్ డైరెక్షన్ లో ‘కాప్పాన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి హీరో సూర్య ఒక ఛానల్ లైవ్ షోలో వెల్లడించారు. మలయాళం హీరో మోహన్ లాల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇకపోతే సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎన్జీకే’ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *