Breaking News
  • హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన.. కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.
  • మహబూబాబాద్ జిల్లా: దీక్షిత్ రెడ్డి హత్య పై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం. బాలుడ్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపి హైటెక్ పద్దతిలో టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేసిన అఘాంతకుడు మంద సాగర్ ను అరెస్ట్ , సెల్ ఫోన్ స్వాధీనం. ఈ నెల 18 సాయంత్రం 5.30 గంటల సమయంలో నేరస్థుడు పధకం ప్రకారం AP36 Q8108 ఫేక్ నెంబర్ బైక్ పై దీక్షిత్ ను తీసుకెళ్లిన హంతకుడు. సీసీ కెమెరాల కు దొరకకుండా దనమయ్య గుట్ట దగ్గర తీసుకెళ్లిన అఘాంతకుడు. దీక్షిత్ ఏడవడం మొదలు పెట్టిన్నప్పుడు దీక్షిత్ కు మత్తు టాబ్లెట్ ఇచ్చి కర్చీఫ్ తో చేతులు కట్టి దీక్షిత్ టీ షర్ట్ తో మెడకు ఉరి బిగించి చంపిన దుండగుడు. ఘటన జరిగిన స్థలం నుండి దీక్షిత్ తల్లికిఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గోనాడు, మిగత వారికి ఎలాంటి సంభందం లేదు.
  • బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ విడుదల. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ని విడుదల చేసిన టీమ్‌. విజువల్‌ వండర్‌గా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌. ప్రతి షాటూ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డ రాధేశ్యామ్‌ టీమ్‌. కృష్ణంరాజు సమర్పిస్తున్న సినిమా రాధేశ్యామ్‌. రాధాకృష్ణకుమార్‌ డైరక్టర్‌, యువీ క్రియేషన్స్ నిర్మాణం. జస్టిన్‌ ప్రభాకరన్‌ బీట్స్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్. బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌లో మూడు మతాలను పోట్రెయిట్‌ చేసిన టీమ్.
  • ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాల ఆఖరి రోజు కృష్ణానది లో దుర్గమ్మ నదీ విహారంపై నెలకొన్న సందిగ్ధత . కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడం తో ఈ నెల 25 న తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై డైలమాలో దుర్గగుడి అధికారులు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో . తెప్పోత్సవం కు మరో రెండు రోజులు మాత్రమే సమయం . కృష్ణా నది లో వరద ఉధ్రుతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇప్పటికే హంస వాహనాన్ని సిద్దం చేస్తున్న దుర్గగుడి అధికారులు . ఈ నెల 25 ఉత్సవాల అఖరి రోజైన ఆదివారం కృష్ణానది లో వరద ఉధ్రుతి కొనసాగితే తెప్పోత్సవాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై తర్జన బర్జన పడుతున్న అధికారులు.
  • నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజు పర్యటిస్తున్న కేంద్ర బృందం. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వం లో, కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారా లు నగరంలో పర్యటిస్తున్నారు. నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి ఓవర్ ఫ్లో అయి నాలాలులోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన లించిన కేంద్రబృందం.
  • రవాణాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి సునీల్ శర్మ తో భేటి tsrtc అధికారులు . రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ భవనం లో మొదలయిన సమావేశం. సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రవాణాశాఖ ఆపేరేషన్స్ ఈ.డి లు . ఈరోజు అంతరాష్ట్ర బస్సు సర్వుసుల ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం.

కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్‌..ఇందుకే !

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా‌ మహమ్మారిని కట్టడి చేయడంలో ఏ దేశ ప్రభుత్వ నాయకత్వం విప్లవాత్మ క నిర్ణయాలు తీసుకుంది ? ఏ దేశ నాయకత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కోవిడ్‌ను తరిమికొట్టడంలో....

Men and Women are Responding to Covid-19 Pandemic, కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్‌..ఇందుకే !

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా‌ మహమ్మారిని కట్టడి చేయడంలో ఏ దేశ ప్రభుత్వ నాయకత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది ? ఏ దేశ నాయకత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కోవిడ్‌ను తరిమికొట్టడంలో చిత్తశుద్ధితో కషి చేస్తోంది? అన్న అంశాలపై ప్రజల్లో గత రెండు, మూడు నెలలుగా చర్చలు సాగుతున్నాయి. మరణాలు నియంత్రించడంలో ఏ దేశం ముందుంది. ముందుగా మేల్కోని లాక్‌డౌన్ విధించిన దేశాలు ఏవి…ప్రజలు ఈ వ్యాధి నియంత్రణలో ఎంత బాధ్యాతాయుతంగా వ్యవహరించారు…దేశాల మధ్యనున్న జీడీపీ సారూప్యతలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లాంటి అంశాలను  తెలుసుకోడానికి ప్రజలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  వీటిపై ఇటీవల నిపుణులు సర్వే  చేయగా  ఆశ్చర్యకరంగా మగ నాయకత్వమున్న దేశాల్లో కంటే మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని తేటతెల్లమైంది.  మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ప్రభుత్వ వాణి ప్రజలదాకా వెళుతోంది. ప్రజలు ప్రభుత్వ సూచనలను బాగా పాటిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సైంటిస్టుల స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ విషయాలపై వివిధ దేశాలలో రెండు వేవ్స్‌లో ఈ సర్వే నిర్వహించింది.  ఈ నివేదిక మహిళా నేతలు, పురుష నాయకుల మధ్య నమ్మకాలు, ప్రవర్తనలలో చాలా తేడాలను గుర్తించింది. ఆ సర్వే ప్రకారం ఈ మహమ్మారిని చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మహిళలు గుర్తించారు. అంతేకాదు దాన్ని నిరోధించే చర్యలను వెంటనే తీసుకోవడంతో పాటు వాటిని పాటించేలా చేయడంలోనూ నిబద్దతగా వ్యవహరించారు.  నాయకత్వంలో ఉన్న పురుషులు, ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారుకనక, వారు ఆ విషయంలో రిస్క్‌ తీసుకోలేదు. కానీ మహిళలు మాత్రం ప్రజలు ప్రాణాల విషయంలో అస్సలు రిస్క్ తీసుకోలేదన్నది సదరు నివేదిక సారాంశం. 

Also Read :

దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై !

ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !

Bigg Boss Telugu 4 : కుమార్ సాయిని టార్గెట్ చేసిన నోయల్ !

 

 

Related Tags