హిందూ దేశం వద్దు.. లౌకిక దేశమే ముద్దు!

Survey reveals maximum number of Indians vote for secular Indian, హిందూ దేశం వద్దు.. లౌకిక దేశమే ముద్దు!

భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆలోచనలను అత్యధిక హిందువులు నిరాకరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సీఎస్ డీఎస్(Centre for the Study of Developing Societies) అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిలో దాదాపు 75 శాతం మంది భారత్ అన్ని మతాలకు, విశ్వాసాలకు సంబంధించిందేనని స్పష్టం చేశారు. ఇండియాను హిందూ రాష్ట్రంగా మార్చాలన్న బీజేపీ, దాని మాతృసంస్థ ఆలోచనలను, ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరించారు. విచిత్రమేమిటంటే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నవారిలో 75 శాతం మంది బీజేపీ ఆలోచనా విధానాన్ని తిరస్కరించినట్టే సోషల్ మీడియాను ఉపయోగించని వారిలో కూడా 73 శాతం మంది తిరస్కరిచడం గమనార్హం.

సామాజిక మాధ్యమాలను ఉపయోగించని వారిలో కేవలం 17 శాతం మంది, ఉపయోగించే వారిలో 19 శాతం మాత్రమే భారత్ హిందువులకే చెందిందని అభిప్రాయ పడ్డారు. తమ అభిప్రాయాలను బలంగా వినిపించడంలో కానీ పంచుకోవడంలో సామజిక మాధ్యమాల ప్రభావం బాగానే పనిచేస్తోందని సర్వే పేర్కొంది. 26 రాష్ట్రాలలో211 పార్లమెంటరీ నియోజకవర్గాలలోని 24,236 మంది ఓటర్లను క్షేత్ర స్థాయిలో సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. సర్వే ఎప్పుడు చేసినప్పటికీ ప్రజల మనోభావాలు ఏమిటనేది తేటతెల్లమవుతోంది. వాస్తవానికి ఈ సర్వే ఏప్రిల్ మే నెల మధ్యలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *