సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి: కాంగ్రెస్ డిమాండ్

ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దేశ భద్రత విషయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్ధాయిలో దుయ్యబట్టింది. ఆపార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల ట్విటర్‌ వేదికగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సైన్యంలో 45వేల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని ప్రభుత్వమే తన వైఫల్యాన్ని పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిందటూ ఆయన ఎద్దేవా చేశారు. దేశ భద్రత విషయాల్లో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉందంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా సైన్యంలో ఖాళీగా ఉన్న […]

సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి: కాంగ్రెస్ డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 8:17 PM

ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దేశ భద్రత విషయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్ధాయిలో దుయ్యబట్టింది. ఆపార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల ట్విటర్‌ వేదికగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సైన్యంలో 45వేల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని ప్రభుత్వమే తన వైఫల్యాన్ని పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిందటూ ఆయన ఎద్దేవా చేశారు. దేశ భద్రత విషయాల్లో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉందంటూ సూర్జేవాలా ట్వీట్ చేశారు.

ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా సైన్యంలో ఖాళీగా ఉన్న 45,634 పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భారత సైన్యంలో ఖాళీలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నట్టు ఉన్న ఓ కథనాన్ని కూడా సూర్జేవాల తన ట్వీట్‌కు లింక్ చేశారు. రెండోసారి అధికారాన్ని చేపట్టిన ప్రధాని మోదీ ఇప్పటికైన సైన్యంలో ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు.