Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
  • ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. లూధియానా లోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 7 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. సుమారు 100 మంది సిబ్బందిని హోమ్ క్వారం టైన్ కి పంపించిన అధికారులు. డైరెక్టర్ జనరల్ (డిజి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
  • లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు చేయుత. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 వేల మంది సినీ కార్మికులకు, టెలివిజన్ కార్మికులకు సొంత ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • అమరావతి: రాష్ట్రంలో నగలు, బట్టలు, చెప్పులు షాపులు తెరిచేందుకు అనుమతి. స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతి మంజూరు . అనుసరించాల్సిన విధానాల పై సర్కులర్ జారీ . పెద్ద షో రూమ్ కు వెళ్లాలంటే ముందే ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి. అన్ని షాపులో ట్రైల్ రూము లకి అనుమతి నిరాకరణ . పాని పూరి బండ్లకు అనుమతి నిరాకరణ.

సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ

Suriya’s NGK Review, సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ

నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్, దేవరాజు, రాజ్‌కుమార్, పొన్నవనం తదితరులు
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాతలు: ఎస్‌ ఆర్ ప్రభు(తమిళ్), కేకే రాధా మోహన్(తెలుగు)
సంగీతం: యువన్ శంకర్ రాజా
జోనర్: పొలిటికల్ థ్రిల్లర్

విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు. మరోవైపు వైవిధ్య దర్శకుడిగా సెల్వరాఘవన్‌కు మంచి పేరుంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ అంటే అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు టీజర్, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో కేజీఎఫ్‌ కోసం ఇటు టాలీవుడ్, అటు టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ఎన్జీకే ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

Suriya’s NGK Review, సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ

కథ:
ఒక ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేసే నంద గోపాల కృష్ణ ఆ ఉద్యోగాన్ని వదిలి రైతుగా పనిచేస్తుంటాడు. కుటుంబంతో సంతోషంగా ఉండే నంద గోపాల్ ఆయన స్నేహితులు క్రిమి సంహారిణి మాఫియా నుంచి కొన్నిఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని కీలక పరిణామాల వల్ల అతడు రాజకీయాల్లోకి వెళ్తాడు. ఒక సాధారణ కార్యకర్త నుంచి మొదలయ్యే సూర్య కెరీర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా పెరుగుతుంది. అయితే ఆయనను అడ్డుకునేందుకు రాజకీయాల్లో ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి దుష్ట రాజకీయ నాయకులను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు..? అందరి మెప్పును పెందే నాయకుడిగా నంద గోపాల కృష్ణ ఎలా ఎదిగాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ:
ప్రేమ కథలను ఎక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన సెల్వ రాఘవన్ సూర్య కోసం పొలిటికల్ కథను రాసుకున్నారు. అయితే ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన విఫలమయ్యారు. కథ పాతదే అయినప్పటికీ కథనంలో మార్పులు చేసి ఇప్పటి దర్శకులు హిట్‌లు కొడుతుండగా.. సెల్వ రాఘవన్ మాత్రం అందులో కూడా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాడు. అందునా కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం కూడా కనిపించదు. ట్విస్ట్‌లు పెద్దగా లేకపోవడంతో పాటు ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సింక్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు సెల్వ రాఘవన్. ఇక యువన్ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. అయితే కెమెరా వర్క్ ఓకే అనిపించినా.. ఎడిటింగ్ విభాగం పనితీరు మాత్రం సినిమాకు మరో మైనస్‌గా నిలిచింది.

Suriya’s NGK Review, సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ

నటీనటులు
: పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే సూర్య ఈ చిత్రంలోనూ అద్భుతనటనను కనబరిచారు. భార్యగా సాయి పల్లవి, కార్పోరేట్ పీఆర్వోగా రకుల్ ఆకట్టుకున్నా.. వారి పాత్రలకు మాత్రం అంతంతమాత్రమే ప్రాధాన్యత ఉంది. ఇక మిగిలిన పాత్రలు కూడా గుర్తుపెట్టుకునేలా లేవు.

ప్లస్‌ పాయింట్స్:
సూర్య, సాయి పల్లవి, రకుల్ నటన
సంగీతం

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
గ్రిప్ లేని స్క్రీన్‌ప్లే
ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సింక్ లేకపోవడం

ముగింపు:
నంద గోపాల కృష్ణ.. సూర్య వన్‌మ్యాన్ షో..

Related Tags