ఫ‌స్ట్ ఫేజ్ : సినీ కార్మికుల‌కు రూ.కోటిన్న‌ర విరాళం ఇచ్చిన సూర్య‌

న‌టుడు సూర్య త‌న గొప్ప మ‌నసు చాటుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.

ఫ‌స్ట్ ఫేజ్ : సినీ కార్మికుల‌కు రూ.కోటిన్న‌ర విరాళం ఇచ్చిన సూర్య‌
Follow us

|

Updated on: Aug 29, 2020 | 8:17 AM

న‌టుడు సూర్య త‌న గొప్ప మ‌నసు చాటుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. దక్షిణ సినీ కార్మికుల సమాఖ్యలోని కార్మికులను ఆదుకునేందుకు రూ.1.5 కోట్లు డొనేష‌న్ ఇస్తున్న‌ట్లు ప్రకటించారు.

తన కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ ఓటీటీలో రానుందని చెప్పిన సూర్య.. తర్వాతి రెండు చిత్రాలు మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఆకాశం నీ హద్దురా’ బిజినెస్‌ ద్వారా వచ్చే రూ.5 కోట్లను కరోనా​ వ్యాప్తి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి అందిస్తానని సూర్య గతంలోనే హామి ఇచ్చారు. ఆయన ప్రకటించిన డొనేష‌న్‌లో ఫ‌స్ట్ ఫేజ్‌లో భాగంగా శుక్రవారం రూ. 1.5 కోట్లను.. భారతీరాజా ఫిల్మ్​ ఇనిస్టిట్యూట్​లో ఎఫ్​ఆఎఫ్​ఎస్​ఐ ప్రెసిడెంట్‌ ఆర్​కే సెల్వమణి, తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అధిపతి కలైపులి ఎస్​ థానులకు సూర్య తండ్రి శివకుమార్​ అందజేశారు. అందులో సౌత్ సినీకార్మికుల సమాఖ్యకు కోటి రూపాయలు, తమిళ చిత్ర నిర్మాతల మండలికి రూ.30 లక్షలు, నడిగర్​ సంఘానికి రూ.20 లక్షలు చెక్​లను అందజేశారు. (ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్)

‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్​ డెక్కన్​ వ్యవస్థాపకుడు జి.ఆర్​ గోపీనాథ్​ బయోపిక్ ఈ చిత్రం రూపొందింది. ఏప్రిల్​ 9నే మూవీ విడుద‌ల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. సుదీర్ఘ చర్చల అనంతరం అక్టోబరు 30న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే సూర్య ప్రకటించారు.

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

నేడు, రేపు ఏపీలో మోస్తరు వర్షాలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..