‘బందోబస్త్’ టీజర్ ఎప్పుడంటే..?

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు కేవి ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బందోబస్త్’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్‌ను ఇవాళ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదగా సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రంలో సూర్య స్పెషల్ కమాండో ఆఫీసర్‌గా నటిస్తుండగా.. మలయాళ […]

'బందోబస్త్' టీజర్ ఎప్పుడంటే..?
Follow us

|

Updated on: Jul 06, 2019 | 1:41 AM

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు కేవి ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బందోబస్త్’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్‌ను ఇవాళ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదగా సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రంలో సూర్య స్పెషల్ కమాండో ఆఫీసర్‌గా నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో కనిపించనున్నారు.

తమిళ హీరో ఆర్య, సయేషా సైగల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది.