సురేశ్ రైనా కాలికి సర్జరీ.. క్రికెట్‌కు దూరం

టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా.. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌ హాస్పిటల్‌లో సురేశ్ రైనా సర్జరీ చేయించుకున్నాడు. దీంతో.. ఓ నెలన్నరపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు.. బీసీసీఐ వెల్లడించింది. భారత్‌ తరపున గత ఏడాది జులైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. కానీ.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. చివరగా ఈ […]

సురేశ్ రైనా కాలికి సర్జరీ.. క్రికెట్‌కు దూరం
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 11:03 AM

టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా.. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌ హాస్పిటల్‌లో సురేశ్ రైనా సర్జరీ చేయించుకున్నాడు. దీంతో.. ఓ నెలన్నరపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు.. బీసీసీఐ వెల్లడించింది. భారత్‌ తరపున గత ఏడాది జులైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. కానీ.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. చివరగా ఈ ఏడాది ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి సత్తా చాటాడు సురేశ్ రైనా.