ఆర్నబ్ అరెస్ట్ కేసుః మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు సమన్లు

సీనియర్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ అరెస్టు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అర్నబ్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.

ఆర్నబ్ అరెస్ట్ కేసుః మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు సమన్లు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 4:59 PM

సీనియర్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ అరెస్టు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అర్నబ్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. ప్రివిలేజ్ నోటీసులను అందుకున్న వ్యక్తిని అరెస్టు చేయడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్నబ్ గోస్వామి అరెస్టుకు సంబంధించి స్టే మంజూరు చేసింది సుప్రీం. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. అటు, ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులను పంపించింది.

అర్నబ్ గోస్వామి అరెస్టు వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ నిర్వహించింది. ఆర్నబ్ గోస్వామి తరఫున ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను వినిపించారు. అసెంబ్లీ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ ముందు మాత్రమే దాఖలు చేయాల్సిన లెటర్‌ను అసెంబ్లీ కార్యదర్శి బహిర్గతం చేయడాన్ని న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రహస్యంగా ఉండాల్సిన లెటర్‌ను బహిర్గతం చేశారని వాదించారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే అసెంబ్లీ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగానే బహిర్గతం చేశారని కోర్టు వ్యాఖ్యానించారు. రహస్యంగా ఉంచాల్సిన లేఖను బహిర్గతం చేయడం ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేమని అన్నారు. న్యాయ వ్యవహారాల్లోశాసనసభ జోక్యం చేసుకున్నట్టుగా కనిపిస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తిని సుప్రీంకోర్టును ఆశ్రయించేంతలా భయపెట్టారని, ఈ వ్యవహారాన్నిసుమోటోగా తీసుకోవాలంటూ హరీష్ సాల్వే చేసిన విజ్ఙప్తి పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. న్యాయ వ్యవహారాలు, అసెంబ్లీకి సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడాన్ని తాము కోర్టు ధిక్కారణ కింద పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకున్నట్టుగా భావిస్తున్నామని వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులను జారీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.