ఏపీలో “లోకల్‌ వార్‌”కు సుప్రీం బ్రేకులు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా హైకోర్టును ఆదేశించింది. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని..ఏపీలో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి ఫిబ్రవరిలో […]

ఏపీలో లోకల్‌ వార్‌కు సుప్రీం బ్రేకులు..
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 1:16 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా హైకోర్టును ఆదేశించింది. 2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని..ఏపీలో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేనందున తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

వాస్తవానికి ఫిబ్రవరిలో పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈసీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రిజర్వేషన్లు 50శాతం దాటి.. 59.5 శాతం చేరుకోవడాన్ని.. వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు. అయితే వీరి పిటిషన్‌ అలా ఉండగానే.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చంటూ హైకోర్టు తెలిపింది. దీంతో హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ.. పిటిషనర్లు సుప్రీం మెట్లెక్కారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతుందన్న తరుణంలో.. ఎన్నికల ప్రక్రియపై స్టే విధించింది సుప్రీంకోర్టు.