తాజ్ నిర్వహణపై నాలుగు వారాల గడువు

తాజ్ మహాల్ ప్రేమకు చిహ్నాంగా చెప్తూంటారు. తాజ్ మహల్ అనగానే ఆ అపూర్వ కట్టడం మదిలో మెదులుతుంది. యూపీలోని ఆగ్రాలో గల ఈ సువిశాల సౌధం సొగసులు చూసి మురిసిపోని వారుండరంటే అతిశయోక్తి కాదు. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం కనుమరుగవుతుంది. కాలుష్యం వల్ల దెబ్బతింటోన్న ఈ కట్టడం భవిష్యత్తు తరాలకు ఫొటోల్లోనే చూపించాలి. తాజాగా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది. చారిత్రక కట్టడాలను కాపాడుకునే బాధ్యత […]

తాజ్ నిర్వహణపై నాలుగు వారాల గడువు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:14 PM

తాజ్ మహాల్ ప్రేమకు చిహ్నాంగా చెప్తూంటారు. తాజ్ మహల్ అనగానే ఆ అపూర్వ కట్టడం మదిలో మెదులుతుంది. యూపీలోని ఆగ్రాలో గల ఈ సువిశాల సౌధం సొగసులు చూసి మురిసిపోని వారుండరంటే అతిశయోక్తి కాదు. తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం కనుమరుగవుతుంది. కాలుష్యం వల్ల దెబ్బతింటోన్న ఈ కట్టడం భవిష్యత్తు తరాలకు ఫొటోల్లోనే చూపించాలి. తాజాగా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది. చారిత్రక కట్టడాలను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని తెలిపింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్ మహల్ను పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో నాలుగు వారాల్లోగా తెలపాలని ఆదేశించింది.