రఫేల్ కేసు రివ్యూ పిటిషన్ల తీర్పు రిజర్వు

డిల్లీ: రఫేల్‌ కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల రహస్య పత్రాలకు సంబంధించి లీకైన పేజీలను తొలగించాలని కోరింది. ఈ ఒప్పందంపై కోర్టుకు ఇచ్చిన కాగ్‌ నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని.. కనిపించకుండా పోయిన ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని […]

రఫేల్ కేసు రివ్యూ పిటిషన్ల తీర్పు రిజర్వు
Follow us

|

Updated on: Mar 15, 2019 | 7:26 AM

డిల్లీ: రఫేల్‌ కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల రహస్య పత్రాలకు సంబంధించి లీకైన పేజీలను తొలగించాలని కోరింది. ఈ ఒప్పందంపై కోర్టుకు ఇచ్చిన కాగ్‌ నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని.. కనిపించకుండా పోయిన ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏజీ కేకే వేణుగోపాల్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఏజీపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించిచారు. వేణుగోపాల్‌ తన వాదనలు వినిపిస్తూ రహస్య పత్రాలకు సంబంధించిన ఫొటో కాపీలతో పిటిషనర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారని వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ పత్రాల్లో కూడా సరైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.

ఏజీ వ్యాఖ్యలపై పిటిషినర్ ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రహస్య పత్రాలు లీకైతే కేంద్రం ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. భద్రతా సేవలకు భంగం కలిగించాలని గానీ, వాటిని అవమానించాలని గానీ తామీ పిటిషన్‌ వేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అందించిన కాగ్‌ రిపోర్టులో 10 ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలున్నాయని ఆయన అన్నారు. ఇందులో కొన్ని పత్రాలను ప్రభుత్వమే లీక్ చేసిందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పత్రాలను దొంగిలించి వాటిని ఫొటో కాపీ చేయించామని అనడానికి రుజువులు చూపించమని ఆయన ప్రశ్నించారు. ధర్మాసనం కూడా ప్రశాంత్‌ భూషణ్‌ వాదనను సమర్థించింది. పిటిషనర్‌కు సంబంధించిన వారి వాదనల్లో ఆధారాలు చూపించారని, ఏజీ కూడా తన వాదనలకు రుజువులు చూపాలని కోరింది. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన