వాహనదారులకు షాక్.. బిఎస్ 4 వాహన విక్రయాలకు మార్చి 31 డెడ్‌లైన్..!

మీ దగ్గర బిఎస్ 4 వెహికిల్ ఉందా? ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదా? ఇంకో 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మీ బండిని స్క్రాప్ కింద అమ్ముకోవాల్సిందే. కేంద్ర రవాణాశాఖ ఇచ్చిన గడువు సరిగ్గా మరో 30 రోజుల్లో ముగుస్తుంది.

వాహనదారులకు షాక్.. బిఎస్ 4 వాహన విక్రయాలకు మార్చి 31 డెడ్‌లైన్..!
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 5:00 PM

మీ దగ్గర బిఎస్ 4 వెహికిల్ ఉందా? ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదా? ఇంకో 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ కాకపోతే మీ బండిని స్క్రాప్ కింద అమ్ముకోవాల్సిందే. కేంద్ర రవాణాశాఖ ఇచ్చిన గడువు సరిగ్గా మరో 30 రోజుల్లో ముగుస్తుంది. మార్చి 31 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలు నిలిచిపోనున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశంగా బిఎస్ 6 వెహికిల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక ఏప్రిల్ 1 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలను అనుమతించరు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1 తరువాత బిఎస్ 6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.

వాహనాల ఉద్గారాలలో పెరుగుతున్న CO2 స్థాయిలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2020 నుండి బిఎస్-6 ఇంధనాన్ని ఉపయోగించాలని ప్రకటించింది. బిఎస్-4 ఇంధనంలో సల్ఫర్ కంటెంట్ తో పోలిస్తే బిఎస్-6 ఇంధనంలో 20% వరకు తగ్గిపోతోంది. ఫ్యూయల్ లో ఉండే సల్ఫర్ కంటెంట్ డీజిల్ ఇంజిన్లలో ఇంజెక్టర్ ల యొక్క లూబ్రికేషన్ కు సాయపడుతుంది, అయితే, వాహనాల నుంచి ఎక్కువగా CO2 రావడానికి ఇది కూడా ప్రధాన కారణం. సల్ఫర్ కంటెంట్ తగ్గించడం వల్ల వేహికల్ లో ఉద్గారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

కాగా.. బిఎస్ 6 వాహనాలలో ఉండే కాంపోనెంట్ లు NOx ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఎగ్జాస్ట్ వాయువుల తగ్గిస్తూ పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడతాయి. డీజిల్ ఇంజిన్ కు చేసిన అన్ని మార్పులు ఫలితంగా తయారీ వ్యయాలు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, అన్ని వాహనాలను (OBD) ఆన్ బోర్డ్ డయగ్నాస్టిక్స్ కొరకు ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసింది. బిఎస్-4 నుంచి బిఎస్-6 కి మారడానికి డీజిల్ వాహనాల నుంచి 70% వరకు తగ్గిన NOx లెవల్స్, పెట్రోల్ వాహనాల నుంచి 25% వరకు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..