అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీం మొగ్గు

అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తులుగా ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీ రామ్ పంచ్‌ల పేర్లను ఖరారు చేసింది. మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించాలని, ఫైజాబాద్‌ కేంద్రంగా మధ్యవర్తితత్వం చేయాలని సూచించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు […]

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి సుప్రీం మొగ్గు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 2:42 PM

అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తులుగా ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీ రామ్ పంచ్‌ల పేర్లను ఖరారు చేసింది. మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించాలని, ఫైజాబాద్‌ కేంద్రంగా మధ్యవర్తితత్వం చేయాలని సూచించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఇక అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా.. రామ్‌లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు మధ్య ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు అప్పజెప్పడంతో ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్‌ తేల్చనుంది.