మహారాష్ట్ర వలస కూలీల లెక్కలపై సుప్రీం సీరియస్

కరోనా కల్లోలానికి ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు దేశ అత్యున్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. కుటుంబ పోషణ భారంగా మారిన కూలీలను గుర్తించి సొంతరాష్ట్రాలకు పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. వలస కార్మికుల కష్టాలపై సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

మహారాష్ట్ర వలస కూలీల లెక్కలపై సుప్రీం సీరియస్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:11 PM

కరోనా కల్లోలానికి ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు దేశ అత్యున్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. కుటుంబ పోషణ భారంగా మారిన కూలీలను గుర్తించి సొంతరాష్ట్రాలకు పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. వలస కార్మికుల కష్టాలపై సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం అయా రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. వలస కూలీల సమస్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా నివారణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. వలస కూలీల గుర్తించి వారికి కల్పించిన వసతులపై ఆయా రాష్ట్రాలు సుప్రీంకు అఫిడవిట్లను సమర్పించాయి. అయితే, మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. మహరాష్ట్ర వలస కూలీల అంశంపై వారం రోజుల్లో సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 17కి వాయిదా వేస్తున్నట్లు . జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తెలిపింది.