ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీం కోర్టు నోటీసులు..

గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి సంబంధించి భూకేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

  • Ravi Kiran
  • Publish Date - 2:21 pm, Tue, 27 October 20

Supreme Court Notices: గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి సంబంధించి భూకేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. భూకేటాయింపు విషయంలో సీఆర్డీఏ నిబంధనలను ఉల్లంఘించి 2017లో జీవో జారీ చేశారని పిటిషనర్ ఆర్కే తరుపు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించగా.. ఈ పిటిషన్‌పై జస్టిస్ నారిమన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనితో టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆ తర్వాతే తదుపరి విచారణ ఉండనుంది.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!