Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • చెన్నై నగరంలో మరికొన్ని ఆంక్షల సడలింపు. ఉ. 6.00 నుంచి రాత్రి 9.00 వరకు హోటళ్లు (పార్సిల్ సర్వీసు మాత్రమే). రాత్రి 9.00 వరకు మాత్రమే హోం డెలివరీ ఉ. 6.00 నుంచి సా. 6.00 వరకు టీ స్టాళ్లకు అనుమతి. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు ఉ. 6 నుంచి సా. 6 వరకు. మాల్స్ మినహా మిగతా దుకాణాలు ఉ. 10 నుంచి సా. 6 వరకు. సడలింపులు జులై 6 నుంచి అమలు.
  • విశాఖ: కేజీహెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ అర్జున. క్లినకల్ ట్రయల్స్ కు కేజీహెచ్ ను ఎంపిక చేసునట్టు ఐసీఎంఆర్ నుంచి మెయిల్ వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రభుత్వ అనుమతి కోరాం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా - డీసీజీఐ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ విధివిధానాలు తరువాత కార్యకలాపాలు ప్రారంభిస్తాం. అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యేందుకు 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఆ తరువాత కేజీహెచ్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం.
  • కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. ఐసోలేషన్ సెంటర్లుగా మారిన బ్యూటీ పార్లర్లు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్న వైనం. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని colours బ్యూటీ స్టూడియోలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు అశ్రయం. రోజుకు రూ.10వేల ఫీజు.. వసూలు..గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా.
  • REC, ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి 12600 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు గ్యారెంటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్. అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్ లకు ప్రభుత్వ అనుమతితో ఊరట.
  • టీవీ9 తో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా. తెలంగాణలో వైరస్ సమూల మార్పుని చోటుచేసుకుంటున్నాయి . ఇప్పటి వరకు తెలంగాణలో సింటమ్స్ కనిపించే a3i (ఏత్రీఐ) వైరస్ ఉండేది. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించని a2a (ఏటుఏ) వైర్ 90శాతం విస్తరించింది. కరోనా మృత దేహాల నుంచి వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళన వద్దు. డెడ్ బాడీస్ నుంచి వచ్చే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. కరోనా వైరస్ ప్రభావం కేవలం ఊపిరితిత్తుల మీదేకాదు మిగిలిన అవయవాల పైనా ఉంది. చేస్తున్న టెస్టులకు పది రెట్లు అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల విధానం సిసిఎంబీలో అభివ`ద్ధి చేశాం. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల పద్ధతి లో టెస్టింగ్ సమయంలో సగం ఆదా అవుతుంది. ఈ పద్దతిలో రోజుకి 500 టస్ట్లు చేసే చోట 1500 నుంచి 2000 వరకు చేయవచ్చు.

ఆధార్ లేదు మరి ! ఆకలి చావుల ‘ అదుపు ఎలా ‘ ? సుప్రీంకోర్టు సూటిప్రశ్న

supreme court issues to all states on establishment of grievance redressal mechanism, ఆధార్ లేదు మరి ! ఆకలి చావుల ‘ అదుపు ఎలా ‘ ? సుప్రీంకోర్టు సూటిప్రశ్న

జాతీయ ఆహారభద్రతా చట్టం కింద అందరికీ ఆహారం లభించేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా మీ స్పందన ఏమిటో తెలియజేయాలని కోరింది. ఈ చట్టం కింద అసలు మీ వద్ద దీనికి ప్రత్యామ్న్యాయంగా సమస్యల పరిష్కార వ్యవస్థ అంటూ ఉందా అని ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులుబీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆకలి చావులను అరికట్టేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ‘ పిల్ ‘ను ఈ బెంచ్ విచారించింది.

ఆధార్ కార్డు లేనిదే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వర్తింపజేయడంలేదని, దీంతో వారు ఆకలి చావులకు గురవుతున్నారని ఈ పిల్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. వీరి తరఫున వాదించిన అడ్వొకేట్ కొలిన్ గాన్‌సాల్వేస్.. అనేకమంది గిరిజనులు ఆధార్ కార్డు లేని కారణంగానో, లేదా తమ రేషన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేసుకోవాలో తెలియకపోవడం వల్లో నష్టపోతున్నారని, వారికి ఆహార భద్రత అంటూ లేకుండాపోతోందని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ బాబ్డే.. ఆధార్ కార్డుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న ధర్మాసనంలో తానూ ఒక సభ్యుడినని, ఆధార్ లేదన్న సాకుతో ఏ పథక ఫలాలనైనా ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోవడం తగదని పేర్కొన్నారు. అందువల్లే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ అంటూ ఉండాలన్నారు.

ఈ అంశాన్ని పరిశీలించేందుకు తాము ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కావాలని కోరుతున్నామని, ఇందుకు తగినవారి పేర్లను సూచించాలని ఆయన పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోరారు. అటు-కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పిల్‌లో పేర్కొన్నట్టు మరణాలు ఆహార కొరత వల్ల సంభవించలేదని అన్నారు. అందరికీ ఆహార పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సర్క్యులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు.

ఝార్ఖండ్‌లోని కరిమతి గిరిజన ప్రాంతంలో సిమ్‌డేగా అనే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలిక సంతోషి.. 2017 సెప్టెంబరు 28న మరణించింది. పిడికెడు అన్నం కోసం అలమటించిన ఆ అమ్మాయి.. అది లభించక ప్రాణాలు కోల్పోయింది. ఆధార్ లేని కారణంగా తమకు రేషన్ దొరకలేదని, ఈ కారణంగా సంతోషి ఆకలి చావుకు గురైందని ఆమె తల్లి కొయిలీ దేవి, సోదరి గుడియా దేవి ఈ పిల్ దాఖలు చేశారు. ఆధార్ లేనందున తమ కుటుంబ రేషన్ కార్డును అధికారులు రద్దు చేశారని వారు పేర్కొన్నారు.

Related Tags