శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటినుంచి ‘సుప్రీం’ విచారణ

శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డేతో కూడిన 9 మంది సభ్యుల రాజ్యాంగధర్మాసనం వీటినివిచారించబోతోంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, ఎల్.నాగేశ్వర రావు, ఎం.ఎం.శాంతనగౌదర్, ఎస్.ఎ. నజీర్, ఆర్.సుభాష్ రెడ్డి, బీ.ఆర్.గవాయ్,సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. దాదాపు 60 రివ్యూ పిటిషన్లను ఈ ధర్మాసనం విచారించబోతోంది. వీటిలో…అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ.. 2018 లో అత్యున్నత ధర్మాసనం ఇఛ్చిన తీర్పును […]

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటినుంచి 'సుప్రీం'  విచారణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2020 | 12:00 PM

శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డేతో కూడిన 9 మంది సభ్యుల రాజ్యాంగధర్మాసనం వీటినివిచారించబోతోంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, ఎల్.నాగేశ్వర రావు, ఎం.ఎం.శాంతనగౌదర్, ఎస్.ఎ. నజీర్, ఆర్.సుభాష్ రెడ్డి, బీ.ఆర్.గవాయ్,సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. దాదాపు 60 రివ్యూ పిటిషన్లను ఈ ధర్మాసనం విచారించబోతోంది. వీటిలో…అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ.. 2018 లో అత్యున్నత ధర్మాసనం ఇఛ్చిన తీర్పును సవాలు చేస్తున్న పిటిషన్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏడాది సెప్టెంబరు 28 న మాజీ సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జీల రాజ్యాంగధర్మాసనం…అన్ని వయసుల మహిళలు కూడా శబరిమలలో ప్రవేశించడానికి అర్హులే అని రూలింగ్ ఇఛ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ తీర్పుపై పెద్దఎత్తున నిరసనలు పెల్లుబికాయి. ఆలయ ఆవరణలో… బలవంతంగా గుడిలోకి ప్రవేశించబోయిన మహిళా భక్తులపై పోలీసులు, స్థానికులు, ఇతర హిందూ సంఘాలవారు దాడులకు పాల్పడ్డారు. వారిని శబరిమల లోనికి అనుమతించలేదు. ఆ ఘటనల్లో కొందరు మహిళలు గాయపడ్డారు కూడా.. అదే సమయంలో కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేకమంది రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. కాగా-2019 నవంబరు 14 న ఈ ధర్మాసనం తీర్పునిస్తూ.. ఈ పిటిషన్లపై విస్తృత ధర్మాసనం రూలింగ్ ఇవ్వాలని పేర్కొంది. నాడు ముగ్గురు న్యాయమూర్తులు అనుకూలంగా, ఇద్దరు ప్రతికూలంగా తీర్పునిచ్చారు.