మహారాష్ట్ర అప్‌డేట్స్: సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ తరపున పృథ్వీరాజ్ చవాన్, రణదీప్ సూర్జేవాలా,  శివసేన తరపున ఎంపీ గజానన్ కృతికార్ హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషనర్ల తరఫున వాదనలు మొదలుపెట్టారు. కేబినెట్ సమావేశం లేకుండా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తేసారని అయన వాదించారు. […]

మహారాష్ట్ర అప్‌డేట్స్: సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:57 PM

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ తరపున పృథ్వీరాజ్ చవాన్, రణదీప్ సూర్జేవాలా,  శివసేన తరపున ఎంపీ గజానన్ కృతికార్ హాజరయ్యారు.

జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషనర్ల తరఫున వాదనలు మొదలుపెట్టారు. కేబినెట్ సమావేశం లేకుండా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తేసారని అయన వాదించారు. ముందు రోజు రాత్రి ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేశాయని, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం కూడా ఆ మూడు పార్టీల దగ్గర ఉందని కపిల్ సిబల్ గుర్తుచేశారు. గవర్నర్ పూర్తి ఏకపక్షంగా,  కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారని అయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ ఏ మేరకు ఆ నిర్ణయానికి వచ్చారో ఎవరికీ తెలియదు, సరియైన పత్రాలేవీ ప్రజలకు అందుబాటులో లేవని కాబట్టి ఈరోజే బల నిరూపణ జరిపేలా ఆదేశాలు ఇవ్వండని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈరోజే బల పరీక్ష నిర్వహించి, తమ బలాన్ని నిరూపించుకోమనిఆదేశాలిచ్చారని.. కర్ణాటకలో 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా సూచించారని కపిల్ గుర్తుచేశారు.  అయితే పార్టీలు హైకోర్టు ను కాకుండా సుప్రీంకోర్టు ను నేరుగా ఎలా ఆశ్రయిస్తాయని బీజేపీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఆరోపించారు.

టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..