Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

Supreme Court dismisses juvenility plea of 2012 gangrape convict Pawan Kumar Gupta, నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌‌తో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను మైనర్‌ని అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ముఖేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన తరువాత, తాజా వారెంట్ ప్రకారం, ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. నిర్బయ ఘటన సమయంలో పవన్ మైనర్ అని చెప్పడానికి కీలక ఆధారాలు ఉన్నాయని అతని తరుపు లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు విన్నవించారు. ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకు వెల్లడించారు. అయితే దోషి తరపు న్యాయవాది వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. అతడు మైనర్ కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్ధించింది. సమయాన్ని వృథా చేయడం కోసమే పదే, పదే పిటిషన్స్ వేస్తున్నారని, ఒకే అంశంపై ఇన్నిసార్లు పిటిషన్‌ దాఖలు చేయకూడదని పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని ధర్మాసనం మందలించింది.

Related Tags