Breaking News
  • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ఏసీపీ నర్సింహారెడ్డి ఏసీబీ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. ఏసీపీ నర్సింహారెడ్డి ని 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి తరపు న్యాయవాది. వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ విచారణకు ను రేపటికి వాయిదా.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.
  • చెన్నై: ఎస్పీ బాలు హాస్పిటల బిల్లుల వివాదంపై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, ఎస్పీ చరణ్ సంయుక్త ప్రెస్ మీట్. మా ఆసుపత్రి మీద రూమర్లు సృష్టించవద్దు. బిల్లుల విషయంలో ఎలాంటి వివాదం లేదు. మేము ప్రతివారం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాము. చివర్లో బిల్లు కట్టవలసిన అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కానీ మూడు కోట్ల బిల్లు అయిందని ఇంకా కోటిన్నర పెండింగ్ ఉందని అందుకనే నాన్నగారి భౌతిక కాయాన్ని అప్పగించలేదని కట్టు కథలు అల్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుమార్తె దీపా వెంకట్ బిల్లు చెల్లించారంటూ ప్రచారం చేశారు. మేము నాన్నని కోల్పోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇంకా బాధ పెడుతున్నారు. తామరై పక్యం లో నాన్నగారి స్మృతి వనం నిర్మిస్తాము. నాన్నగారి కి భారత రత్న వస్తే సంతోషమే.. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఎప్పుడూ ఆయన భారతరత్నే. ఆయన ఏ ప్రోగ్రామ్ కి హాజరైనప్పుడు కరోనా సోకిందనేది ఇప్పుడు అప్రస్తుతం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది..మేము నాన్నగారిని కోల్పోయాము. ఇప్పటికైనా నాన్నగారి మీద దుష్ప్రచారాలు ఆపండి.

గెహ్లాట్ కి ఊరట, 6 గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనవచ్ఛు, సుప్రీంకోర్టు

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. రేపు రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బల పరీక్ష జరిగితే ఓటింగ్ లో ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలు..

Ashok Gehlot, గెహ్లాట్ కి ఊరట, 6 గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనవచ్ఛు, సుప్రీంకోర్టు

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. రేపు రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బల పరీక్ష జరిగితే ఓటింగ్ లో ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనగలుగుతారు. కాంగ్రెస్ పార్టీలో వీరి విలీనంపై తాత్కాలిక స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ని విచారించిన కోర్టు అందుకు తిరస్కరించింది. అయితే తుది నిర్ణయాన్ని రాజస్థాన్ లోని సింగిల్ జడ్జి కోర్టుకే వదిలివేసింది. రాష్ట్ర హైకోర్టు ఇదివరకే ఈ పిటిషన్ ని విచారిస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోజాలమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేల విలీనాన్ని బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. శాసన సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు వీరి ఓటింగ్ గెహ్లాట్ కి చాలా కీలకం. అటు-గురువారం సాయంత్రం అయిదు గంటలకు రాజస్థాన్ సీఎల్ఫీ మీట్ కానుంది. ఆ సమావేశంలో గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ ముఖాముఖి కలుసుకోనున్నారు.

అవిశ్వాస తీర్మానం పెట్టనున్న బీజేపీ

రాజస్తాన్ అసెంబ్లీలో గెహ్లాట్ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. ఈ పార్టీ నేతలు వసుంధరా రాజే సింధియా, రాజస్థాన్ పార్టీ నాయకులు ఈ ఉదయం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ మిత్ర పక్షాలతో కలిసి రేపు శాసన సభలో గెహ్లాట్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా తెలిపారు. మా వ్యూహాన్ని మార్చుకున్నామని, కాంగ్రెస్ పార్టీలో రెండు  వర్గాల మధ్య సయోధ్య కుదిరినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండజాలదని ఆయన చెప్పారు.

Related Tags