కరోనా డిసిన్ఫెక్టంట్ టన్నెళ్లు, ఛాంబర్ల వినియోగంపై సుప్రీంకోర్టు బ్యాన్

కోవిడ్-19 నేపథ్యంలో వినియోగంలోకి వచ్చిన డిసిన్ఫెక్టంట్ టన్నెళ్లు, ఛాంబర్ల వినియోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. వాటి ద్వారా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉందని పరిశోధనలు చెబుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టన్నెళ్ల ఏర్పాటు, వినియోగం, ప్రకటనలపై బ్యాన్ కోరుతూ వచ్చిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. సదరు పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆరోగ్యంపై దుష్ప్రభావాల నేపథ్యంలో బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. […]

కరోనా డిసిన్ఫెక్టంట్ టన్నెళ్లు, ఛాంబర్ల వినియోగంపై సుప్రీంకోర్టు బ్యాన్
Follow us

|

Updated on: Nov 05, 2020 | 11:55 AM

కోవిడ్-19 నేపథ్యంలో వినియోగంలోకి వచ్చిన డిసిన్ఫెక్టంట్ టన్నెళ్లు, ఛాంబర్ల వినియోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. వాటి ద్వారా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉందని పరిశోధనలు చెబుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టన్నెళ్ల ఏర్పాటు, వినియోగం, ప్రకటనలపై బ్యాన్ కోరుతూ వచ్చిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. సదరు పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆరోగ్యంపై దుష్ప్రభావాల నేపథ్యంలో బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.