ఆ అభిమాని పట్ల రజనీ ఔదార్యం!

కొద్దిరోజుల క్రితం కేరళ యువకుడు ప్రణవ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడానికి ‘ఆనంద వికటన్’ అనే తమిళ వారపత్రిక ద్వారా తన జీవితకాల స్వప్నాన్ని వ్యక్తం చేశాడు. సూపర్ స్టార్ వెంటనే చెన్నైలోని తన పోయెస్ గార్డెన్‌లో ఆ వ్యక్తి తనను వ్యక్తిగతంగా కలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ప్రణవ్‌కు చేతులు లేనందున, రజనీకాంత్ శుభాకాంక్షల సంజ్ఞగా ప్రణవ్ యొక్క పాదాన్ని స్పృశించాడు. ప్రణవ్ సూపర్ స్టార్ కు తాను గీసిన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రణవ్‌కు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:46 am, Tue, 3 December 19

కొద్దిరోజుల క్రితం కేరళ యువకుడు ప్రణవ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడానికి ‘ఆనంద వికటన్’ అనే తమిళ వారపత్రిక ద్వారా తన జీవితకాల స్వప్నాన్ని వ్యక్తం చేశాడు. సూపర్ స్టార్ వెంటనే చెన్నైలోని తన పోయెస్ గార్డెన్‌లో ఆ వ్యక్తి తనను వ్యక్తిగతంగా కలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ప్రణవ్‌కు చేతులు లేనందున, రజనీకాంత్ శుభాకాంక్షల సంజ్ఞగా ప్రణవ్ యొక్క పాదాన్ని స్పృశించాడు. ప్రణవ్ సూపర్ స్టార్ కు తాను గీసిన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రణవ్‌కు చేతులు లేనప్పటికీ  కాళ్లతో చాలా పనులు చేయగలడు. కేరళ ముఖ్యమంత్రితో ఆయన ఇటీవల తీసుకున్న సెల్ఫీ వైరల్ అయ్యింది, ఇప్పుడు, సూపర్ స్టార్‌తో ఆయన 20 నిమిషాల సుదీర్ఘ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ప్రణవ్ శారీరకంగా భిన్నమైన సామర్థ్యం కలిగి ఉన్నా, తనలోని లోపాలను తిప్పికొట్టి  ఆనందంగా ఎలా జీవించాలో నిరూపించాడు.