Breaking News
  • హైదరాబాద్: పోలీసులకు 9 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా అందించిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌.
  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. వలస కార్మికులకు కనీస వేతనం చెల్లించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌. పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు. వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజనం. మధ్యాహ్నం 40 వేల మందికి, రాత్రి పూట 15 వేల మందికి భోజనం. నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటున్న జీహెచ్‌ఎంసీ. ఆరేళ్ల క్రితం 8 కేంద్రాలతో ప్రారంభం, నేడు 150 కేంద్రాలకు విస్తరణ.
  • గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి చేయడం సిగ్గుచేటు. డాక్టర్లపై దాడిని ఒవైసీ ఎందుకు ఖండించలేదు. ప్రభుత్వానికి, డాక్టర్లకు సహకరించాలని ఒవైసీ ఎందుకు చెప్పడంలేదు. డాక్టర్లపై దాడి చేస్తే రోగులను అడవుల్లో వదిలిపెట్టాలి -ఎమ్మెల్యే రాజాసింగ్‌.
  • విశాఖలో కరోనా వైరాలజీ ల్యాబ్‌. కేజీహెచ్‌లో ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు. కాసేపట్లో ప్రారంభించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌.

మాస్, క్లాస్.. నీ ‘దూకుడు’కు ‘సరిలేరు’ ఎవరు

Mahesh Babu Birthday, మాస్, క్లాస్.. నీ ‘దూకుడు’కు ‘సరిలేరు’ ఎవరు

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘దూకుడు’కు మరో పేరు. ఈ పేరు వినగానే ఎన్నో రికార్డులు, మరెన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఇటు క్లాస్, అటు మాస్.. మరోవైపు ప్రయోగాలతో వయసు బేధం లేకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత మహేష్ బాబుది. కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన తనయుడిగా.. ‘రాజకుమారుడు’గా అభిమానులు గర్వపడేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ‘మహర్షి’.

అంతేకాదు మరోవైపు నిర్మాణరంగంలోనూ రాణిస్తున్న ఆయన.. ఆ మధ్య ఏఎమ్‌బీ సినిమాస్‌ను నిర్మించి మల్టీఫెక్స్ రంగంలోకి, తాజాగా హంబుల్ అనే బ్రాండ్‌తో ఆన్‌లైన్ దుస్తుల రంగంలోకి వచ్చి.. పక్కా ‘బిజినెస్‌మాన్‌’గానూ తనదైన ముద్రను వేస్తున్నాడు ఈ ‘యువరాజు’. అంతేనా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ‘శ్రీమంతుడు’గా మారి.. ఆ గ్రామ అభివృద్ధికి తనదైన సామాజిక బాధ్యతను నెరవేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ పలువురి ప్రాణాలు కాపాడి వారి కుటుంబాల్లో ‘ఒక్కడు’గా పేరు సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ.. ముఖ్యంగా పిల్లలను క్రమశిక్షణతో పెంచుతూ ‘సరిలేరు నీకెవ్వరు’గా వెలుగొందుతున్నాడు ఈ ‘పోకిరి’.

కాగా ఇవాళ మహేష్ 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఏదేమైనా మహేష్ ‘ఖలేజా’ ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్ మహేష్‌బాబు.

 

Related Tags