సూపర్ మార్కెట్ టమోటాలకు ‘స్వర్ణయుగం’!

నాటు టమోటాలు.. నీటు టమోటాలు..! ఒకటి తినడానికి బాగుంటే.. మరొకటి చూడ్డానికి మాత్రమే ఎర్రగా బుర్రగా బాగుంటాయి. అందుకే సూపర్ మార్కెట్లో మెరుస్తూ ఊరించే హైబ్రిడ్ టమోటాల జోలికి చాలామంది వెళ్లరు. కానీ.. సూపర్ మార్కెట్ టమోటాల్ని కూడా సూపర్ టేస్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు బొటానికల్ సైంటిస్టులు. ఆ దిశగా సూపర్ సక్సెస్ కొట్టారు కూడా. టమోటా చెట్లు మరింత పెద్దవిగా.. మరింత తాజాగా పెరిగేందుకు మందులు కనిపెట్టిన రీసెర్చర్లు.. మరింత రుచిగా వుంచగలిగే సూక్ష్మం […]

సూపర్ మార్కెట్ టమోటాలకు 'స్వర్ణయుగం'!
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 9:21 PM

నాటు టమోటాలు.. నీటు టమోటాలు..! ఒకటి తినడానికి బాగుంటే.. మరొకటి చూడ్డానికి మాత్రమే ఎర్రగా బుర్రగా బాగుంటాయి. అందుకే సూపర్ మార్కెట్లో మెరుస్తూ ఊరించే హైబ్రిడ్ టమోటాల జోలికి చాలామంది వెళ్లరు. కానీ.. సూపర్ మార్కెట్ టమోటాల్ని కూడా సూపర్ టేస్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు బొటానికల్ సైంటిస్టులు. ఆ దిశగా సూపర్ సక్సెస్ కొట్టారు కూడా. టమోటా చెట్లు మరింత పెద్దవిగా.. మరింత తాజాగా పెరిగేందుకు మందులు కనిపెట్టిన రీసెర్చర్లు.. మరింత రుచిగా వుంచగలిగే సూక్ష్మం కూడా పసిగట్టేశారు.

కృత్రిమ టమోటా సీడ్ ని మరింత పరిపుష్టం చేసేందుకు దోహదపడేలా సరికొత్త DNA దొరికిందిప్పుడు. 725 కల్టివేటెడ్ టొమాటోల జీనోమ్స్‌ని మ్యాపింగ్ చేసి.. వాటి పూర్వ రంగాన్ని పరిశీలించి ఈ అరుదైన జీన్‌ని సాధించారట. 4,873 కొత్త జీన్స్‌ని గుర్తించి.. వాటిలో అత్యంత ఫలవంతమైన TomLoxC అనే జీన్‌ని ట్రేసవుట్ చేశారు. దీన్ని వాడితే పుట్టే టమోటాలు అత్యంత రుచికరంగా ఉంటాయట. పెరట్లో పెరిగే టొమాటోల్లో కేవలం 2.2 శాతం వుండే TomLoxC జీన్.. పొలాల్లో కృత్రిమంగా పెంచే టొమాటోల్లో 91.2 శాతం వుంటుందట. ఈ లెక్కన భవిష్యత్ టమోటాలు ఎంత బ్రహ్మాండంగా వుంటాయో తేల్చుకోవచ్చు.