తమిళ రాజకీయాల్లో సంచలనం, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటన

అభిమాన సంఘాలతో కీలక చర్చల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాట జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:35 pm, Thu, 3 December 20
తమిళ రాజకీయాల్లో సంచలనం,  కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటన

అభిమాన సంఘాలతో కీలక చర్చల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాట జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. 2021 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. డిసెంబర్ 31 న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. రజినీ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తలైవా తమిళనాడు తదుపరి సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.