Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

సంచలన పాత్రలో సన్నీలియోన్.. ఈసారి ఏం చేయబోతోందంటే.. ?

ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన కొద్దికాలంలోనే టాప్ సెలెబ్రెటీగా వెలిగిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎరోటిక్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారింది సన్నీ లియాన్. వరుస సినిమాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రత్యేక గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌విల్లా సీజన్‌ 12’ సిరీస్‌తో బిజీగా ఉన్న సన్నీ లియాన్ త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని బాలీవుడ్ టాక్. అదీ కూడా ఫుల్ ‘ఏ’ సర్టిఫికెట్ సిరీస్ అని బీ టౌన్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ దర్శకురాలు ఏక్తాకపూర్ వాత్సాయన ‘కామసూత్ర’ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి సన్నీలియోన్‌తో సంప్రదింపులు జరిపారట. ఇక ఇందులో నటించేందుకు సన్నీ కూడా సుముఖతతో ఉన్నారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఏక్తా కపూర్, సన్నీ లియోన్‌ల కాంబినేషన్‌లో ఇదివరకే ‘రాగిణి ఎంఎంఎస్ 2’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం తమిళంలో ‘వీరమాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.