ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న సునీల్.. కమెడియన్‌ చేసిన దర్శకుడే మళ్లీ విలన్ చేస్తున్నాడు.

టాలీవుడ్‌కు ఒక మంచి కమెడియన్‌ను అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు అతని స్నేహితుడైన సునీల్‌ను విలన్‌గా చూపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే...

ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న సునీల్.. కమెడియన్‌ చేసిన దర్శకుడే మళ్లీ విలన్ చేస్తున్నాడు.
Follow us

|

Updated on: Dec 26, 2020 | 1:31 PM

sunil to play villain in trivikram movie: నువ్వే కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సునీల్ పేరుతో ఒక మంచి కమెడియన్ దొరికాడు. సునీల్ కామెడీ ఆ స్థాయిలో పండడానికి అతని బాడీ లాంగ్వేజ్ ఎంత పాత్ర పోషించిందో.. త్రివిక్రమ్ రాసిన మాటలు కూడా అంతే స్థాయిలో పండాయి. ఇలా టాలీవుడ్‌కు ఒక మంచి కమెడియన్‌ను అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు అతని స్నేహితుడైన సునీల్‌ను విలన్‌గా చూపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ కూడా నటించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో సునీల్ ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా కాకుండా విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో సునీల్ నటించిన విషయం తెలిసిందే. మరి సునీల్ విలన్‌గా నటించనున్నాడన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.