మరోసారి ‘మర్యాద రామన్న’ జోడీ … పదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్న సునీల్-సలోని 

కమెడియన్ గా రాణిస్తున్న సమయంలో సడన్ గా హీరోగా మారిపోయాడు సునీల్.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న'సినిమాతో సునీల్ హీరోగా టర్న్ అయ్యాడు...

  • Rajeev Rayala
  • Publish Date - 12:55 pm, Sat, 28 November 20
మరోసారి 'మర్యాద రామన్న' జోడీ ... పదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్న సునీల్-సలోని 

కమెడియన్ గా రాణిస్తున్న సమయంలో సడన్ గా హీరోగా మారిపోయాడు సునీల్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన’మర్యాద రామన్న’సినిమాతో సునీల్ హీరోగా టర్న్ అయ్యాడు. ఆతర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు సునీల్.ఇప్పుడు విలన్ గా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన’కలర్ ఫోటో’ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు.సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న’పుష్ప’లో కూడా సునీల్ విలన్ గా నటిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక’మర్యాద రామన్న’సినిమాలో సునీల్, సలోని జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఇద్దరు కలిసి సందడి చేయనున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ సరసన సలోనిని ఎంపిక చేశారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సైలెంట్ గా జరుగుతుందని తెలుస్తుంది. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వస్తుందని ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.