పరాజయ ఫలితం: కాంగ్రెస్‌కు మరో పీసీసీ చీఫ్ రాజీనామా

Sunil Jakhar resignation, పరాజయ ఫలితం: కాంగ్రెస్‌కు మరో పీసీసీ చీఫ్ రాజీనామా

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు తమ పదవులకు రాజీనామా చేయగా.. ఆ లిస్ట్‌లో తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జక్కర్ చేరారు. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సునీల్.. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయబోతున్నట్లు సునీల్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖను పంపారు. అయితే జక్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయినందుకు అధ్యక్షపదవికి రాహుల్ గాంధీ కూడా రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *