కోహ్లీ వ్యాఖ్యలకు సన్నీ కౌంటర్!

నాలుగోస్థానంలో యువ కీపర్‌ రిషబ్‌పంత్‌ను కొనసాగించడానికి టీమిండియా భావిస్తోందని కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ చేసిన వ్యాఖ్యలను సునీల్‌ గవాస్కర్ వ్యతిరేకించాడు. విండీస్‌తో జరిగిన రెండో వన్డేల్లో పంత్‌(20) మరోసారి నిరాశపరచగా  శ్రేయస్‌ అయ్యర్‌(71) విలువైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్‌(18), పంత్‌ తక్కువ పరుగులకే ఔటవ్వడంతో ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌..  విరాట్‌(120)కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అయ్యర్‌ ఒడిసి పట్టుకున్నాడని, అతని ఆట తీరుతో ఎంత విలువైన ఆటగాడో చాటిచెప్పాడని, నాలుగోస్థానంలో పంత్‌ కన్నా అతడే సరిగ్గా సరిపోయాడని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాగే పంత్‌ కూడా ఐదు, ఆరు స్థానాల్లోనే మ్యాచ్‌ ఫినిషర్‌గా పనికొస్తాడని, ఆ స్థానాలే అతడి ఆటశైలికి సరిపోతాయని చెప్పాడు. కోహ్లీ, ధావన్‌, రోహిత్‌ 40 ఓవర్ల పాటు కొనసాగితే.. అప్పుడు పంత్‌ నాలుగో స్థానంలో రావాలని, ఒకవేళ టాప్‌ఆర్డర్‌ 30-35 ఓవర్లలోపే ఔటైతే శ్రేయస్‌ అయ్యర్‌ ముందు రావాలని చెప్పుకొచ్చాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *