త‌న రెస్టారెంట్ పేరుతోనే సినిమా తీస్తోన్న సందీప్

యంగ్ హీరో ఇటీవ‌ల సోమ‌వారం ఓ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు. అంద‌రూ అత‌డు పెళ్లి చేసుకోబుతున్నాడ‌ని అనుకున్నారు. కానీ అత‌డు త‌న సొంత బ్యాన‌ర్ వెంక‌టాద్రి టాకీస్‌లో మూవీ ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు.

త‌న రెస్టారెంట్ పేరుతోనే సినిమా తీస్తోన్న సందీప్
Follow us

|

Updated on: Aug 17, 2020 | 7:09 PM

యంగ్ హీరో ఇటీవ‌ల సోమ‌వారం ఓ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు. అంద‌రూ అత‌డు పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని అనుకున్నారు. కానీ అత‌డు త‌న సొంత బ్యాన‌ర్ వెంక‌టాద్రి టాకీస్‌లో మూవీ ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు. అది కూడా త‌న రెస్టారెంట్ నేమ్ వివాహ భోజ‌నంబు అనే టైటిల్‌తో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ బ్యాన‌ర్ లో నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమాని నిర్మించాడు. అందులో అత‌డే హీరో కానీ ఈ సారి వేరే న‌టుడితో సినిమా నిర్మిస్తున్నాడు. అత‌డు ఎవ‌డ‌నేది రివీల్ చెయ్య‌లేదు. క‌మెడియ‌న్ స‌త్య అని అందరూ భావిస్తున్నారు. రామ్ అబ్బ‌రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్య‌నున్నారు.

కాగా ప్ర‌స్తుతం ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాలో న‌టిస్తున్నాడు సందీప్ కిష‌న్. ఈ చిత్ర షూటింగ్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిపోయింది. లావ‌ణ్య త్రిపాఠి సందీప్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.