టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

హైదరాబాద్: రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌  మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచి చెన్నై అద్భుత ఫామ్‌లో ఉండగా మరోవైపు సన్‌రైజర్స్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కు చెన్నై జట్టు ధోని కు రెస్ట్ ఇవ్వగా.. అతని ప్లేస్ లో రైనా సారధ్య బాధ్యతలు స్వీకరించాడు. హైదరాబాద్ […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
Follow us

|

Updated on: Apr 17, 2019 | 8:37 PM

హైదరాబాద్: రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌  మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచి చెన్నై అద్భుత ఫామ్‌లో ఉండగా మరోవైపు సన్‌రైజర్స్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కు చెన్నై జట్టు ధోని కు రెస్ట్ ఇవ్వగా.. అతని ప్లేస్ లో రైనా సారధ్య బాధ్యతలు స్వీకరించాడు. హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేయగా.. చెన్నై కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. పఠాన్, నదీమ్ హైదరాబాద్ జట్టులోకి రాగా.. కరణ్ శర్మ, సామ్ బిల్లింగ్స్ చెన్నై జట్టులోకి వచ్చారు.