‘కపటధారి’కి సెన్సార్ పూర్తి.. థియేటర్‌లోనే రిలీజ్.. విడుదల తేది చెప్పేసిన సుమంత్ టీమ్‌

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తైన సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు

  • Tv9 Telugu
  • Publish Date - 9:59 pm, Tue, 24 November 20

Kapatadhaari release date: తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తైన సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుమంత్ తన కపటధారి సినిమాకు విడుదల తేదిని ప్రకటించారు. క్రిస్మస్‌ కానుకగా థియేటర్‌లో కపటధారి విడుదల కానుందని మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ మూవీకి సెన్సార్‌ కూడా పూర్తి కాగా.. యు/ఎ సర్టిఫికేట్‌ వచ్చింది. (మురగదాస్‌ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌.. ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియో డిస్నీ పిక్చర్స్ నిర్మాణంలో మూవీ)

కాగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. నాజర్‌, శ్వేతా నందిత, పూజా కుమార్‌, జయప్రకాష్‌, సంపత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలను పెంచింది. (మంచు విష్ణు- శ్రీను వైట్లల ‘ఢీ అండ్‌ ఢీ’.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఫిక్స్ చేయనున్నారా..!)