అదిరిపోయిన `సుల్తాన్‌` ఫస్ట్ లుక్ !

తమిళ హీరో కార్తికి తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ హీరో.

  • Ram Naramaneni
  • Publish Date - 10:22 pm, Mon, 26 October 20

హీరో కార్తికి తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ హీరో. గత ఏడాది ప్రయోగాత్మకంగా తెరకెక్కన `ఖైదీ` చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత వదిన జ్యోతికతో కలిసి తొలిసారి నటించిన `దొంగ` కూడా బాగానే ఆడింది. తాజాగా `సుల్తాన్‌`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తి. శివకార్తికేయన్‌తో `రెమో` సినిమా తీసి  మంచి పేరు తెచ్చుకున్న భాగ్యరాజ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. `ఖైదీ` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్. ప్రభు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ దశలో ఉంది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.  ఇందులో కొరడా పట్టుకుని రౌద్రమైన లుక్​లో కార్తి కనిపిస్తున్నారు.

karthi sulthan cinema

 

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును