Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

‘లూసిఫర్’ రిమేక్‌లో చిరు, చరణ్..సీన్‌లోకి మెస్మరైజింగ్ డైరెక్టర్..!

Sukumar Next film with Chiranjeevi, ‘లూసిఫర్’ రిమేక్‌లో చిరు, చరణ్..సీన్‌లోకి మెస్మరైజింగ్ డైరెక్టర్..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్  ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరు పూర్తి న్యాయం చేశారని..ఇండస్ట్రీ మొత్తం కొనియాడుతుంది. తండ్రికి..కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడని అందరూ చర్చించుకుంటున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చిరు యమ బిజీ:

ఇక ఆ జోష్‌లో ఉండగానే మెగాస్టార్.. కొరటాల శివతో చేయనున్న సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేశారు. కొరటాల శివ సెన్సుబుల్ డెరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ జోడించి.. అతడు స్టార్ హీరోలతో  తీసిన సినిమాలు బంపర్ హిట్లు అందుకున్నాయి.  ఇంతవరకూ ఒక్క ప్లాపు కూడా తీయకుండా సెంట్ పర్సెట్ సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్న కొరటాల..మెగాస్టార్‌కి పక్కా హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయి సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక పోతే రామ్ చరణ్..మెగా అభిమానుల కోసం మరో క్రేజీ న్యూస్‌ని తీసుకొచ్చాడని ఫిలిం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. కంప్లీట్ యాక్టర్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయనున్న సుకుమార్?:

అయితే ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపథ్యంలో..తాజాగా సుకుమార్ పేరు ట్రాక్‌లోకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత..మహేశ్ బాబుతో మూవీ చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సుక్కు..బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. అది కంప్లీట్ అయ్యాక..చిరంజీవి మూవీని టేకోవర్ చేస్తారట. ఈ లోపులో చిరు కూడా..కొరటాల శివ మూవీని సెట్ రైట్ చేసి బయటకు వస్తారు.

మెగా మల్టీస్టారర్‌గా ప్లాన్‌: 

ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే..మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని సమాచారం. రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లి’ సినిమాలో చిరు గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా చిరంజీవితో కలిసి రామ్ చరణ్ స్టెప్పులేశాడు. ఈ రెండు సినిమాలు సిల్వర్ స్రీన్‌ని షేక్ చేశాయి. ఈ మెగా డ్యుయో కాసేపు కనిపిస్తేనే ఇలా ఉంది అంటే..ఫుల్ లెంగ్త్‌లో మెగాస్టార్, మెగాస్టార్ పవర్‌స్టార్ కలిస్తే..ఇక రచ్చరంబోలానే.

తనకు కలిసొచ్చిన దర్శకులను..చిరు కోసం సెలక్ట్ చేస్తున్న చెర్రీ:

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ కోసం దర్శకుడిగా సురేంద్రరెడ్డిని రిఫర్ చేసింది రామ్ చరణే. ఇతడు గతంలో చెర్రీకి ‘ధృవ’ రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ‘లూసిఫర్’ రిమేక్ కోసం సుకుమార్‌ని ఫ్రిపర్ చేశాడట చరణ్. ఇటీవలే సుకుమార్..’రంగస్థలం’ రూపంలో చరణ్‌కు ఎటువంటి హిట్ ఇచ్చాడో తెలిసిందే. మొత్తానికి తనకు కలిసొచ్చిన దర్శకులను తండ్రికి కూడా రిఫర్ చేస్తూ..పితృభక్తి చాటుకుంటున్నాడు చరణ్.